Kannepalli Pump House | ఈటలది బీజేపీ మాటనా లేక బీఆర్ఎస్ స్క్రిప్టా? టీపీసీసీ చీఫ్ కౌంటర్

కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు.

Shivam nagarani

అరటుడే వెబ్‌డెస్క్: Kannepalli Pump House | కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  ( Mahesh Kumar Goud ) తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన మాటలు సొంత పార్టీ విధానాలకు అనుగుణంగా ఉన్నాయా లేక బీఆర్ఎస్ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం సాగుతున్నాయా అని మహేశ్ కుమార్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంకేతిక అంశాలను విస్మరించి రాజకీయాలు చేయడం సరికాదని హెచ్చరించారు.

Kannepalli Pump House | కేంద్ర సంస్థ ఆదేశాలే ప్రామాణికం..

కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని తీయొద్దని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ (NDSA) ఇప్పటికే స్పష్టమైన నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా పరమైన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని, అటువంటి నిపుణుల కమిటీ ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని పేర్కొన్నారు.

pcc.1

Kannepalli Pump House | ప్రధానిని కలిసి అనుమతి తేవాలి..

ఈటల రాజేందర్ ఈ విషయంపై నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, ఎన్‌డీఎస్‌ఏ నిర్ణయాన్ని మార్పించి అనుమతులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ‘ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ’ అన్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వ్యవహారశైలి ఉందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు లోపాయికారీగా ఒకటేనని తాము మొదటి నుండి చెబుతున్నది ఇప్పుడు వంద శాతం నిజమైందని ఆరోపించారు.

Kannepalli Pump House | నిపుణుల మాటలే ముఖ్యం..

కేటీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కాదని, ఎన్‌డీఎస్‌ఏ అధికారుల నివేదికలే ప్రామాణికమని చెప్పారు. ప్రజా క్షేత్రంలో ఈ రెండు పార్టీలు ఆడుతున్న రాజకీయ డ్రామాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచి, వాటి బండారాన్ని బయటపెడుతుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:  Telangana Government Schools | పాఠశాలల మూసివేత ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి.. సీఎం రేవంత్‌కు మేధావుల ఘాటు లేఖ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *