Asian Para Games | ఆసియా పారా గేమ్స్​.. ఆర్చరీలో భారత్​కు గోల్డ్​ మెడల్​

ఆసియా పారా గేమ్స్​ ఆర్చరీలో భారత క్రీడాకారులు బంగారు పతకం గెలుచుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Asian Para Games | జపాన్​లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్​ (Asian Para Games)లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. గురువారం శీతల్ దేవి, తోమన్ కుమార్ జోడీ ఆర్చరీ కాంపౌండ్ మిక్స్​డ్​ టీమ్ ఈవెంట్‌లో ఇండోనేషియాపై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 1,402 పాయింట్ల సంయుక్త స్కోరుతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

ఫైనల్‌లో శీతల్ దేవి, తోమన్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచి, ఇండోనేషియాను 151-148 తేడాతో ఓడించి పోడియంపై అగ్రస్థానంలో నిలిచారు. మహిళల డిస్కస్ త్రోలో సువర్ణ రాజ్ స్వర్ణం సాధించింది పారా-ఆర్చరీలో మహిళల విభాగంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో చైనాకు చెందిన సెన్ మెంగ్కాన్ చేతిలో 4-6 తేడాతో ఓడిపోయిన స్వాతి చౌదరి రజత పతకాన్ని సాధించింది.

బ్యాడ్మింటన్​లో కాంస్య పతకాలు

బ్యాడ్మింటన్​ పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లు అభిజీత్ సఖుజా, సుహాస్ యతిరాజ్ కాంస్యం కైవసం చేసుకున్నారు. యతిరాజ్ ఇండోనేషియాకు చెందిన ఫ్రెడీ సెటియావాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో ఓడిపోయారు. మరోవైపు సఖుజా తన మ్యాచ్‌లో నవీన్ శివకుమార్ (భారత్) చేతిలో 21-13, 21-15 తేడాతో పరాజయం పాలయ్యారు. కృష్ణ నగర్, నిత్య శ్రీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Asian Para Games | ఆసియా పారా గేమ్స్​లో మరో గోల్డ్​ మెడల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *