India Pakistan Final | పాక్​పై ఘన విజయం.. పసిడి గెలుచుకున్న భారత్​

ఆసియా క్రీడల్లో పాక్​పై భారత్​ 19 పరుగుల తేడాతో విజయం సాధించి, పసిడి పతకం గెలుచుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Pakistan Final | ఆసియా క్రీడల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్​తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని చిత్తు చేసి పసిడి పతకం గెలుచుకుంది.

ఆసియా గేమ్స్​ (Asian Games) ఫైనల్​లో భారత్​, పాక్​ తలపడ్డాయి. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్​ చేసింది. అభిషేక్​ శర్మ 61, తిలక్​ వర్మ 51, శివమ్​ దూబే 27, శ్రేయాస్​ అయ్యర్​ 21, ఇషాన్​ కిషన్​ 20 పరుగులు చేశారు. దీంతో భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్​ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది.

India Pakistan Final | నవాజ్​ ఒంటరి పోరాటం

పాక్​ జట్టు 33 పరుగుల వద్ద తొలి వికెట్​ కోల్పోయింది. ఫర్హాన్​ 10 పరుగులకే పెవిలియన్​ బాట పట్టాడు. మాజ్​ 23, ఆయూబ్​ 27 పరుగులు చేశారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పాక్​ బ్యాటర్​ హసన్​ నవాజ్​ ఒంటరి పోరాటం చేశాడు. 51 బంతుల్లో 96 పరుగులు చేశాడు. అయితే మిగతా బ్యాట్స్​మెన్​ విఫలం కావడంతో పాక్​ లక్ష్యం ఛేదించలేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్​ సుందర్​ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో పాక్​ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో భారత్​ గోల్డ్​ మెడల్ సాధించింది.

ఇది కూడా చదవండి..: India Pakistan Final | పాక్​తో ఫైనల్​ పోరు.. భారత్ భారీ స్కోరు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *