Pre-Children’s Day 2026 | ప్రాజెక్ట్ వికసిత్ భారత్ 2047..ఢిల్లీలో ఘనంగా ‘మాదర్స్ అడ్వకేటింగ్ వాల్యూస్’ ప్రీ-చిల్డ్రన్స్ డే వేడుకలు

భావి తరంలో నైతిక విలువలను పెంపొందించడం, పిల్లల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం ద్వారానే దేశం మరింత స్థిరంగా, ప్రగతిశీలకంగా , సమృద్ధిగా మారుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Pre-Children’s Day 2026 | భావి తరంలో నైతిక విలువలను పెంపొందించడం, పిల్లల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం ద్వారానే దేశం మరింత స్థిరంగా, ప్రగతిశీలకంగా , సమృద్ధిగా మారుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని లేడీ ఇర్విన్ సీనియర్ సెకండరీ పాఠశాలలో ‘మాదర్స్ అడ్వకేటింగ్ వాల్యూస్’ (MAV) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రీ-చిల్డ్రన్స్ డే 2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ‘వికసిత్ భారత్ కోసం విలువలతో కూడిన యువత’ అనే ఇతివృత్తంతో (Theme) ఈ సదస్సును నిర్వహించారు.

Pre-Children’s Day 2026 | నైతిక పౌరుల ద్వారానే..

కేవలం ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధి , అకాడమిక్ విజయాలు మాత్రమే ఒక శక్తివంతమైన దేశాన్ని నిర్మించలేవని, బాధ్యతాయుతమైన, కరుణ కలిగిన నైతిక పౌరుల ద్వారానే ‘వికసిత్ భారత్ 2047’ స్వప్నం సాకారమవుతుందని ప్రతినిధులు స్పష్టం చేశారు. పాఠశాలలు, తల్లిదండ్రులు, పాలకులు, , వివిధ సంస్థలు కలిసికట్టుగా పిల్లలలో నైతిక విలువల క్షీణతను అరికట్టాలని పిలుపునిచ్చారు.

Pre-Children’s Day 2026 | ప్రముఖుల సమక్షం – సందేశాలు..

ఈ కార్యక్రమంలో ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి లతా గుప్తా, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శ్రీ సుమీత్ అంకూర్ సింగ్, మాజీ యూపీ ఐజీ డాక్టర్ శంతను ముఖర్జీ, ఢిల్లీ  ( Delhi ) పోలీస్ డీసీపీ జితేంద్ర మణి త్రిపాఠి, మోటార్‌స్పోర్ట్ ర్యాలీ డ్రైవర్ డాక్టర్ బానీ యాదవ్, ప్రముఖ విద్యావేత్త మీనాక్షి ఖురానా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లతా గుప్తా పిల్లలకు తల్లే తొలి గురువని, ఆమె నేర్పించే క్రమశిక్షణ, నైతికతలే సమాజానికి పునాదని పేర్కొనగా.. వ్యక్తిగత క్రమశిక్షణ, ధర్మనిష్ఠతోనే దేశ బలం పెరుగుతుందని, విద్యార్థులు తమ ఆశయాలతో పాటు సమాజం పట్ల బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలని డాక్టర్ శంతను ముఖర్జీ సూచించారు. అలాగే కేవలం మార్కులు, ఆర్థిక విజయాలు మాత్రమే కాకుండా కరుణ, పరస్పర గౌరవం, సామాజిక స్పృహను పెంపొందించేదే నిజమైన విద్య అని విద్యావేత్త మీనాక్షి ఖురానా ఉద్ఘాటించారు.

Pre-Children’s Day 2026 | సరికొత్త విధానం..

చదువు, పాలన, మీడియా, వ్యాపార రంగాలలో చేసే ప్రతీ నిర్ణయం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేసేందుకు ‘వాల్యూస్ ఫిల్టర్ (Values Filter)’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయాలని MAV సంస్థ కోరింది. నైతిక పాఠాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా నిత్య జీవితంలో భాగంగా మార్చాలని ప్రతిపాదించింది.

కార్యక్రమంలో భాగంగా పాఠశాల NCC క్యాడెట్ల మార్చ్ పాస్ట్, పోస్టర్ మేకింగ్ పోటీలు, కవితా పఠనాలు నిర్వహించారు. విద్యార్థులంతా కరుణ, నిజాయితీ, రెస్పెక్ట్, బాధ్యతాయుతంగా ఉంటామని ‘స్టూడెంట్ వాల్యూస్ ప్రతిజ్ఞ’ చేశారు. విజేతలకు బహుమతులు అందజేసి కార్యక్రమాన్ని ముగించారు.

ఇది కూడా చదవండి:  Anganwadi Services | అంగన్​వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలి: కలెక్టర్​ గరిమా అగ్రవాల్​

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *