అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET Paper Leak Protest | నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో భాగంగా జంతర్‌మంతర్ వద్ద గత 37 రోజులుగా సాగిన నిరసన దీక్షలు ముగిశాయి. ఈ నేపథ్యంలో సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆదివారం ఉదయం ( జులై 26 ) ఎక్స్ వేదికగా ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
NEET Paper Leak Protest | ప్రభుత్వం దిగిరావడంతో విరమణ..
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ , ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో ఈ ఆందోళనను విరమిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది ముగింపు కాదని, దేశ విద్యా వ్యవస్థలో పూర్తి పారదర్శకత వచ్చే వరకు, విద్యార్థులకు సరైన న్యాయం జరిగే వరకు తమ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు.
NEET Paper Leak Protest | గత 37 రోజులు కఠినమైనవి..
గత 37 రోజులు తన జీవితంలోనే అత్యంత కఠినమైనవని అభిజీత్ దీప్కే తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నానని, ఉదయం లేచాక సాయంత్రం వరకు ఏం జరుగుతుందో అనే టెన్షన్ లేని పరిస్థితి రావడం సంతోషంగా ఉందన్నారు. జంతర్‌మంతర్ నిరసనలో పాల్గొని మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. అలాగే తమను విమర్శించిన వారికి సైతం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ విమర్శలే తమను మరింత మెరుగ్గా ముందుకు నడిపించాయని ఆయన పేర్కొన్నారు.
CJP Founder @abhijeet_dipke releases a video thanking everyone who made the huge victory of the youth possible.
He also thanks all critics for helping him improve, and eventually deliver on the promise of the Cockroach Janta Party’s first campaign. #ANewDay pic.twitter.com/1JQNozymLo
— Cockroach is Back (@Cockroachisback) July 26, 2026
ఇది కూడా చదవండి: Rajnath Singh Warning | పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్