Jurala Project Inflow | జూరాలకు ప్రారంభమైన వరద..

జూరాల ప్రాజెక్ట్​కు వరద ప్రారంభం అయింది. ప్రస్తుతం 3,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jurala Project Inflow | తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్​కు వరద ప్రారంభం అయింది. ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో స్వల్ప ఇన్​ఫ్లో వస్తోంది.

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది (Krishna River)కి వరద పోటెత్తింది. అయితే కర్ణాటకలోని ఆల్మట్టి (Almatti), నారాయణపూర్​ జలాశయాలు ఇంకా పూర్థిస్థాయిలో నిండలేదు. దీంతో దిగువకు నీటిని పూర్తిగా విడుదల చేయడం లేదు. ఆల్మట్టికి భారీ వరద వస్తుండగా.. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్​ జలాశయానికి సైతం ఇన్​ఫ్లో వస్తుండగా.. గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ బిరబిర పరుగులు పెడుతూ.. జూరాల వైపు వస్తోంది.

Jurala Project Inflow | 3 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో

జురాలకు ప్రస్తుతం 3,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. వరద తక్కువగా ఉన్న.. భీమా, దాని ఉపనదుల నుండి గణనీయమైన నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.09 మీటర్ల నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.318 టీఎంసీ నీరు ఉంది. ఎగువన వర్షాలు పడుతుండటం, కర్ణాటకలోని జలాశయాలు నిండుకుండలా మారడంతో ఈ నెలాఖరు వరకు జూరాలకు భారీ వరద వచ్చే అవకాశం ఉంది.

Jurala Project Inflow | గోదావరికి జలకళ

గోదావరి (Godavari)కి స్వల్పంగా వరద పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం దగ్గర 15.3 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాణహిత నుంచి భారీగా వరద వస్తోంది. మరోవైపు ఎగువన గోదావరి వెలవెలబోతుంది. శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్ప ఇన్​ఫ్లో మాత్రమే నమోదు అవుతోంది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు.

దీనిని కూడా చదవండి : Rajnath Singh Warning | పాకిస్థాన్​కు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వార్నింగ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *