అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fee Reimbursement | విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గుడ్‌న్యూస్ చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులను ముందుగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఫీజులు కట్టలేదని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపడానికి వీలులేదన్నారు. విద్యార్థులు అడక్కుండానే వారి ఖాతాలో డబ్బులు వేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఏటా రూ. 2,400 కోట్లు విద్యార్థుల ఖాతాల్లో వేసి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Fee Reimbursement | సాంకేతిక నైపుణ్యం అందిపుచ్చుకోవాలి
కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం సూచించారు. ఒకప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు వచ్చేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏఐ వల్ల ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ నిపుణుల ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో మనం ఆలోచన చేయాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడాకారులకు ప్రోత్సాహకం అందిస్తామని హామీ ఇచ్చారు.
దీనిని కూడా చదవండి : Golconda Fort | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. గోల్కొండ కోట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు