అక్షరటుడే, వెబ్డెస్క్ : H-FAST Raids | హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి జిల్లాల్లోని 6 ఆహార తయారీ యూనిట్లపై హెచ్ –ఫాస్ట్ బృందం దాడులు చేసింది. ఆరుగురిని అదుపులోకి తీసుకుంది.
ఆరు ఆహార వ్యాపార సంస్థలపై హైదరాబాద్ నగర పోలీసుల హెచ్-ఫాస్ట్ జరిపిన దాడుల్లో, వాడిన వంట నూనె, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు, కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో అపరిశుభ్రమైన ఆహార తయారీ, అక్రమ నిల్వ, సురక్షితం కాని ఆహార ఉత్పత్తుల అమ్మకంతో సహా తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
H-FAST Raids | ఆరు సంస్థలపై..
బహదూర్పూరలోని కేవోపీ అగ్రోటెక్కు చెందిన వంట నూనె, బాస్మతి బియ్యం రీప్యాకింగ్ యూనిట్, కిషన్ బాగ్లోని స్నాజీ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్, మైలార్‌గడ్డలో వీరభద్ర ఎంటర్‌ప్రైజెస్, ట్విన్ సిటీస్ ఎంటర్‌ప్రైజెస్, మల్కాజ్గిరిలో ఎస్ఎస్ బేకరీపై అధికారులు దాడులు చేశారు. అపరిశుభ్రమైన పరిస్థితులలో ఆహారాన్ని తయారు చేసి నిల్వ చేయడం, వంట నూనెను పదేపదే వాడటం, కృత్రిమ ఆహార రంగులను ఉపయోగించడం చేస్తున్నట్లు గుర్తించారు. కొన్ని ప్రాంగణాలలో కీటకాలు, బొద్దింకలు, పావురాలు ఉండటం గమనార్హం. దీంతో అధికారులు కేసు నమోదు చేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
దీనిని కూడా చదవండి : Alprazolam Drug Bust | కోళ్ల ఫారంలో డ్రగ్స్ దందా.. షాకిచ్చిన ఈగల్ ఫోర్స్