Ramakrishna Rao Appointed | ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు

ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత సీఎస్ రామకృష్ణా రావును ప్రభుత్వం నియమించింది

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ramakrishna Rao Appointed | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత సీఎస్ రామకృష్ణా రావును నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు కొనసాగుతున్నారు. జూన్​ 30న ఆయన పదవి విరమణ చేయనున్నారు. దీంతో కొత్త సీఎస్​గా ప్రభుత్వం 1992 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్​ జాజును నియమించింది. ఈ క్రమంలో రామకృష్ణారావును సీఎం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాకుండా మరో 13 మంది ఐఏఎస్ అధికారులను సైతం బదిలీ చేసింది.

Ramakrishna Rao Appointed | శైలజ రామయ్యర్​ బదిలీ

Ramakrishna Rao Appointed

ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శైలజ రామయ్యర్​ (ప్రధాన సంక్షేమ & అభివృద్ధి పథకాల అమలు విభాగం, కార్పొరేట్ సామాజిక బాధ్యత)ను బదిలీ చేశారు. ఆమె స్థానంలో సబ్యసాచి ఘోష్​ను నియమించారు. సబ్యసాచి ఘోష్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సంక్షేమ పదవులకు ఎఫ్ఏసీ (FAC) గా కొనసాగుతారు. శైలజ రామయ్యర్​ ఈఎఫ్ఎస్&టి శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ చేశారు. రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్స్) పదవికి ఎఫ్ఏసీలో ఆమె నియమితులయ్యారు.వీరితో పాటు ఐఏఎస్​ అధికారులు అహ్మద్ నదీమ్, ఎన్. శ్రీధర్, రాహుల్ బోజ్జా, బి. అజిత్ రెడ్డి, మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ, పి. కాత్యాయనీ దేవి, పి. ప్రవీణ్య, టి. వెంకన్న కె. విద్యాసాగర్‌, కె. చంద్రకళలను సైతం ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​ చేసింది.

ఇది కూడా చదవండి..: Sanjay Jaju | తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *