Bhupathi Reddy Warning | చెరువులను కబ్జా చేస్తే చర్యలు తప్పవు: రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Srinivas Kolluri

అక్షరటుడే, డిచ్​పల్లి: Bhupathi Reddy Warning | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నల్లమట్టి తవ్వకాల పేరిట చెరువు శిఖం భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్​ ఆర్.భూపతి రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Bhupathi Reddy Warning | నల్లమట్టి పేరుతో..

నల్లమట్టి తరలింపు పేరుతో కొంతమంది దానిని దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే (MLA Bhupathi Reddy) అన్నారు. చెరువు శిఖం భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిపై రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ తదితర శాఖల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేయబడతాయన్నారు. ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేయవద్దన్నారు. ఈ మేరకు సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, పోలీసు, శాఖల అధికారులకు నిరంతర పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.

Bhupathi Reddy Warning

ఇది కూడా చదవండి..: Mahesh Kumar Goud | తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది..: టీపీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *