తెలంగాణKomiravelli Panchayat Bribery | డ్రైనేజీ పైపులైన్​ తొలగించేందుకు లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ ...

Komiravelli Panchayat Bribery | డ్రైనేజీ పైపులైన్​ తొలగించేందుకు లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచి భర్త!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Komiravelli Panchayat Bribery | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా కనీసం భయపడటం లేదు. ప్రజల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. తాజాగా ఏసీబీ Anti Corruption Bureau అధికారులు నిర్వహించిన అవినీతి నిరోధక దాడిలో కొమిరవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

Komiravelli Panchayat Bribery | ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా

కొమిరవెల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జి. రాజు గౌడ్‌ ఫిర్యాదుదారుడి స్థలంలో గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైప్‌లైన్‌ను తొలగించేందుకు రూ.10 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

ఈ మొత్తాన్ని సర్పంచి భర్త గొల్లపల్లి ఆంజనేయులు ద్వారా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటున్న ఘటనకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Komiravelli Panchayat Bribery | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

Modi Online Classes | విద్యాసంస్థలు కొన్నాళ్లు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలి : ప్రధాని Modi పిలుపు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SP Rajesh Chandra | చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల ఆట కట్టించిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పట్టణంలో పలు చోరీలకు...

Modi Online Classes | విద్యాసంస్థలు కొన్నాళ్లు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలి : ప్రధాని Modi పిలుపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Modi Online Classes | అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత...

Kamareddy Vegetable Vendors | పట్టణంలో రాత్రివేళ రోడ్డు పక్కనే కూరగాయల విక్రయాలు..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Vegetable Vendors | పట్టణంలో రోజువారీగా కూరగాయల...