Virat Kohli Emotional | కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ.. ఓదార్చిన అనుష్క శర్మ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Virat Kohli Emotional | ఐపీఎల్​ ఫైనల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (Royal Challengers Bangalore) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు ట్రోఫీలు సాధించి రికార్డు సృష్టించింది.

Virat Kohli Emotional

రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను సందడి చేసిన ఐపీఎల్​ (IPL) ముగిసింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్​లో గుజరాత్​ టైటాన్స్​, ఆర్సీబీ మధ్య జరిగిన ఫైనల్​లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. గుజరాత్​ బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు 155 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ సులువుగా ఛేదించింది. విరాట్ కోహ్లీ 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

Virat Kohli Emotional | కోహ్లీ భావోద్వేగం

Virat Kohli Emotional

మ్యాచ్​ గెలుపు అనంతరం ఆర్సీబీ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. కప్​ను పట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో కింగ్​ కోహ్లీ సైతం ట్రోఫీని చేత పట్టుకొని కన్నీళ్లు పెట్టున్నారు. విరాట్​ను భార్య అనుష్క శర్మ ఓదార్చింది. అనంతరం కోహ్లీ కప్​ను ముద్దాడాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా 18 ఏళ్ల నిరీక్షణ తెరదించుతూ గతేడాది ఆర్సీబీ తొలిసారి కప్​ గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో కప్​ను తన ఖాతాలో వేసుకుంది.

ఇది కూడా చదవండి..: IPL 2026 Final | ఆర్సీబీ ఖాతాలో రెండో టైటిల్.. ఐపీఎల్ ఫైనల్​లో గుజరాత్​పై గ్రాండ్​ విక్టరీ!

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *