Abhay Singh Final | భారత్​కు మరో పతకం ఖాయం.. ఫైనల్​కు దూసుకెళ్లిన అభయ్​ సింగ్​

స్క్వాష్ పురుషుల సింగిల్స్​లో అభయ్ సింగ్ ఫైనల్​లోకి దూసుకెళ్లాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Abhay Singh Final | ఆసియా క్రీడల్లో (Asia Games) భారత్​కు మరో పతకం ఖాయం అయింది. స్క్వాష్ పురుషుల సింగిల్స్​లో అభయ్ సింగ్ ఫైనల్​లోకి దూసుకెళ్లాడు.

అభయ్​ సింగ్​ ఆదివారం జరిగిన సెమీస్​లో పాక్​కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్‌పై ఘన విజయం సాధించాడు. అనంతరం ఫైనల్​కు దూసుకెళ్లాడు. దీంతో భారత్​కు పతకం ఖాయం అయింది. ఫైనల్​లో అభయ్​ మలేషియాకు చెందిన ఇయాన్ యోవ్ ఎన్‌జితో తలపడనున్నాడు. ఇందులో గెలిస్తే గోల్డ్​ మెడల్​, ఓడితే సిల్వర్​ మెడల్ వస్తుంది. అభయ్​ సెమీ ఫైనల్​లో ఇర్ఫాన్‌పై 11-3, 12-10, 11-6 తేడాతో గెలుపొందడు.

Abhay Singh Final | మిగతా క్రీడల్లో..

మిగతా క్రీడల్లో సైతం భారత ఆటగాళ్లు రాణించారు. మహిళల షార్ట్‌బోర్డ్ విభాగంలో కమలీ ప్రకాష్, షుగర్ శాంతి గేయన్ మూడో రౌండ్‌కు అర్హత సాధించారు. సర్ఫింగ్ పురుషుల షార్ట్‌బోర్డ్ విభాగంలో శివరాజ్ బాబు మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు. ఆర్చరీ పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల టీమ్​ సెమీస్​కు దూసుకెళ్లింది. సెపక్​ తక్రాలో భారత జట్టు దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది.

దీనిని కూడా చదవండి : KTR Warning | రెచ్చిపోయే వాళ్లను వదిలిపెట్టం.. కేటీఆర్​ వార్నింగ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *