అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CJP Protest | ఢిల్లీ (Delhi)లో నిరసనలకు నేడు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో హై టెన్షన్ నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
సీజేపీ నిరసన నేపథ్యంలో మోహన్ ఎస్టేట్ ప్రాంతం చుట్టూ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్పైక్ స్ట్రిప్స్‌ను కూడా అమర్చారు. 20 వేల మందికి పైగా సిబ్బందిని మోహరించారు. ఈ నిరసనకు పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. అంతేగాకుంగా నగరంలో 400 మందిని అదుపులోకి తీసుకున్నారు.
CJP Protest | మెట్రో స్టేషన్లు మూసివేత
సీజేపీ నిరసన నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను పోలీసులు మూసి వేశారు. రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, కాశ్మీర్ గేట్‌తో సహా 45 మెట్రో స్టేషన్ల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు మూసి వేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 250కి పైగా రైళ్లు, స్థానిక రైళ్లను రద్దు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి జనపథ్-కర్తవ్య పథ్ కూడలికి 4 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
#WATCH | Delhi: Police maintain high security around Mohan Estate area ahead of the Cockroach Janta Party (CJP) protest today. Spike strips also installed here. https://t.co/PwCjc2g245
— ANI (@ANI) October 10, 2026
దీనిని కూడా చదవండి : Rajouri Road Accident | ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం.. ఇద్దరి దుర్మరణం!