అక్షరటుడే, ఆర్మూర్ : Sriramsagar Project |ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. తెలంగాణ (Telangana)తో పాటు మహారాష్ట్రలో తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద వస్తోంది.
Sriramsagar Project | రైతుల్లో చిగురిస్తున్న ఆశలు..
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,064.50 అడుగుల (15.4 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజు 21.029 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,199 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా ఆవిరి, మిషన్ భగీరథ ద్వారా 751 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశాజనకంగా ఉండడంతో ఆయకట్టు కింది ఆరు లక్షల ఎకరాల రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. అయితే తాజాగా ఇన్ఫ్లో వస్తుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడితే జలాశయంలోకి వరద పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: TPCC Chief | 70వేల ఉద్యోగాలిచ్చాం.. బీఆర్ఎస్తో చర్చకు సిద్ధం : టీపీసీసీ చీఫ్