Nizamabad Child Kidnapping | బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతం.. కిలాడి లేడి ఆట కట్టించిన పోలీసులు

నిజామాబాద్​లో బాలుడిని కిడ్నాప్​ చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Child Kidnapping | రెండు రోజులుగా జిల్లాలో (Nizamabad) సంచలనంగా మారిని బాలుడి కిడ్నాప్​ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన మహిళను పోలీసులు (Nizamabad Police) అదుపులోకి తీసుకున్నారు.

Nizamabad Child Kidnapping | అసలు ఏం జరిగిందంటే..

బాల్కొండ(balkonda) మండలంలోని నాగాపూర్​ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో శనివారం చికిత్స నిమిత్తం మాతాశిశు ఆస్పత్రికి వచ్చారు. అయితే వారిద్దరు పిల్లలు బయట ఆడుకుంటుండగా.. అందులో చిన్న బాలుడిని ఓ మహిళ మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లింది. ఇదంతా సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. బాలుడు కనిపించట్లేదని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే అలర్ట్​ అయ్యారు. డయల్​ 112ను కాల్​చేశారు. పోలీసులు మాతా శిశు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ పుటేజీలను వెలికితీసి చూడగా మహిళ బాలుడిని తీసుకెళ్తున్నట్లుగా స్పష్టంగా కనిపించింది.

Nizamabad Child Kidnapping | అప్రమత్తమైన పోలీసులు..

వెంటనే పోలీస్​శాఖ అప్రమత్తమైంది. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) 8 బృందాలనే ఏర్పాటు చేశారు. వారంతా సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు ఆమెతో పాటు మరో నిందితుడిని ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో పోలీసులు​ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్​లో వారిని పట్టుకొని, బాలుడిని రక్షించారు.

ఇది కూడా చదవండి: India Population Clock | రాకెట్ వేగంతో పెరుగుతున్న జనాభా.. ఎయిమ్స్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ సంచలనం

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *