అక్షరటుడే వెబ్‌డెస్క్: SBI Bank Strike 2026 | ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌పై ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్న నేపథ్యంలో.. ఖాతాదారులను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది.
SBI Bank Strike 2026 | ఉచిత ATM లావాదేవీలు..
సమ్మె సమయంలో వినియోగదారులు ఇతర బ్యాంకుల ఏటీఎమ్‌లలో నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి ఏటీఎమ్ లావాదేవీ రుసుములు వసూలు చేయబోమని SBI ప్రకటించింది. అయితే, ఆయా ప్రాంతాల్లోని ఏటీఎమ్‌లలో నగదు లభ్యతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.
SBI Bank Strike 2026 | సెప్టెంబర్ 27 ఆదివారం కూడా ..
ఖాతాదారులకు అత్యవసర బ్రాంచ్ పనులు పూర్తి చేసుకునేందుకు వీలుగా సెప్టెంబర్ 27వ తేదీని ప్రత్యేక బ్యాంకింగ్ పనిదినంగా ప్రకటించారు. సాధారణంగా ఆ రోజు ఆదివారం అయినప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB) తప్పనిసరిగా పనిచేయాలని అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పత్రాల సమర్పణ, బ్రాంచ్ స్థాయి అభ్యర్థనలు లేదా నేరుగా బ్యాంక్ అధికారుల సహాయం అవసరమైన వారు సమ్మె ప్రారంభం కాకముందే, అనగా సెప్టెంబర్ 27న తమ పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు.
SBI Bank Strike 2026 | డిజిటల్ సేవలు యథావిధిగా..
సమ్మె సమయంలో నగదు కొరత లేదా బ్రాంచ్ సేవలు నిలిచిపోయినా దైనందిన లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. యూపీఐ (UPI) ద్వారా మర్చంట్ చెల్లింపులు, మనీ ట్రాన్స్‌ఫర్‌లు ఎప్పట్లాగే చేసుకోవచ్చు. అలాగే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS, IMPS సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు ముందుగానే తమ డిజిటల్ యాప్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని, బ్రాంచ్ పనులను సెప్టెంబర్ 27లోపే ముగించుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: ASMITA Khelo India | అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పూర్తి