అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad Hotel Checks | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ (Nizamabad) కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిఘా పెంచారు. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.
Nizamabad Hotel Checks | నగర శివారులోని..
కలెక్టరేట్లో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్ చుట్టుపక్కల ఉన్న హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈమధ్య హోటల్ గదుల్లో దిగిన ఇతర ప్రాంతాల వ్యక్తుల వివరాలు సేకరించారు. వారు జిల్లాకు వచ్చిన సందర్భాన్ని తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ నగరంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Tree Cutting Fine | అనుమతులు లేకుండా చెట్ల నరికివేత.. కాంట్రాక్టర్‌కు రూ.8 వేల జరిమానా