అక్షరటుడే, కామారెడ్డి: Sweet Shop Inspections | స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఫుడ్‌సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఇటీవల ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు (Bhikkanoor) మండల కేంద్రంలోని పలు స్వీట్ షాపుల్లో గురువారం ఫుడ్‌సేఫ్టీ (Food Safety Officials) అధికారి విక్రమ్ తనిఖీలు నిర్వహించారు.
Sweet Shop Inspections | గడువు తీరిన పదార్థాల ధ్వంసం..
తనిఖీల్లో భాగంగా కొన్ని దుకాణాల్లో గడువు తీరిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. గడువు తీరిన పదార్థాలు తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని, వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉన్న దుకాణాలకు నోటీసులు జారీ చేశారు.
ఆహార పదార్థాలు తయారు చేసే ప్రదేశంలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఉన్న ఆహార నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఆహార పదార్థాలను తయారు చేసే వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, గ్లౌజులు, క్యాప్ వాడాలని, వంటగది, సామగ్రి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారి చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఆంజనేయస్వామిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ