అక్షరటుడే, వెబ్‌డెస్క్: DTO Venkanna Death | జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణ శాఖాధికారి(DTO) వెంకన్న మృతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
డీటీవో వెంకన్న జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో బొగ్గు లోడ్‌తో వెళ్తున్న వాహనం వేగంగా ఆయనపై దూసుకొచ్చింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ డీటీవో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు.
DTO Venkanna Death | అండగా ఉంటాం
విధినిర్వహణ లో ఉన్న డీటీవో వెంకన్న మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఉన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వెంకన్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Bhupalpally DTO Death | వాహనాలు తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్.. డీటీవో మృతి