Gurukul Tenders | గురుకులాల్లో నిత్యావసర సరుకుల సరఫరాకు టెండర్ల ఆహ్వానం

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gurukul Tenders | కామారెడ్డి (Kamareddy) జిల్లా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (Social Welfare Schools) నిత్యావసర సరుకుల సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Gurukul Tenders | జిల్లాలో 12 గురుకులాలు..

జిల్లాలోని బాన్సువాడలో(Banswada), తాడ్వాయి, పెద్దకొడప్​గల్​, తాడ్వాయ్, ఎల్లారెడ్డి(Yellareddy), తాడ్వేల్, దోమకొండ, లింగంపేట్, కామారెడ్డి మున్సిపల్ డిగ్రీ కళాశాల, ఉప్పలవాయి, బిచ్కుంద, ఎల్లారెడ్డిపేట, దిష్టిపల్లి ఆచంపేట గురుకులాల్లో సరుకులు సరఫరా చేయాల్సి ఉంటుంది. కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్, పాలు, క్యాటరింగ్ సర్వీస్, స్వీపింగ్, పారిశుధ్య సేవలు, స్టేషనరీ సామగ్రి, ల్యాబ్ మెటీరియల్​ ఉంటాయి.

veg

Gurukul Tenders | టెండర్ షరతులు..

టెండర్ ఫారం రూ.1,000 ఉంటుంది. ఎస్​బీఐ(SBI) సిరిసిల్ల రోడ్డు బ్రాంచ్​, కామారెడ్డి, ప్రిన్సిపాల్​ టీజీఎస్​డబ్ల్యూఆర్​ఎస్​/జేసీ(బాలుర) ఉప్పలవాయి పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది. దరఖాస్తుఫారాలు ఈనెల 13వ తేదీలోపు ఉప్పలవాయి టీజీఎస్​డబ్ల్యూఆర్​ఎస్​/జేసీ(బాలుర)లో తీసుకుని 13వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు సీల్​ చేసి టెండర్​ సమర్పించాల్సి ఉంటుంది. టెండర్లను ఈనెల 18న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో తెరుస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, మహిళలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. పూర్తి వివరాలకు టీజీఎస్​డబ్ల్యూఆర్​ఈఐ సొసైటీ సీవో ఆఫీస్​ కామారెడ్డి లేదా టీజీఎస్​డబ్ల్యూఆర్​ఎస్​/జేసీ(బాలుర) ఉప్పలవాయిలో సంప్రదించాల్సి ఉంటుంది.

chicken

ఇది కూడా చదవండి: RBI Repo Rate | ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *