Dichpally Police Cordon Search | పోలీసుల కార్డన్‌ సెర్చ్‌.. పలు బైక్​లు స్వాధీనం

డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌, ఇస్లాంపురా కాలనీల్లో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: Dichpally Police Cordon Search | నిజామాబాద్​ జిల్లా డిచ్‌పల్లి (Dichpally) మండలం ఘన్‌పూర్‌, ఇస్లాంపురా కాలనీల్లో శుక్రవారం రాత్రి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని పలు బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.

Dichpally Police Cordon Search |డిచ్​పల్లి సీఐ వినోద్​ ఆధ్వర్యంలో..

డిచ్‌పల్లి సీఐ వినోద్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పోలీసులు ప్రతి ఇంటినీ సోదా చేసి, అనుమానితుల గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని సుమారు 84 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగానే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు.

అనుమానాస్పద వ్యక్తులు, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఇతర ధ్రువపత్రాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు ఆరిఫ్‌, మహేష్‌, సుమలతతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఆంజనేయస్వామిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *