అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ration Dealers | జిల్లా (Nizamabad) వ్యాప్తంగా రేషన్ల డీలర్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.
Ration Dealers | గౌరవ వేతనం పెంచాలి..
అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అతిలమ నాగేష్, చిట్టి పార్థసారధి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థలో తాము కీలకంగా పనిచేస్తున్నామన్నారు. అయితే చాలీచాలని గౌరవ వేతనంతో ఆర్థికంగా కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. నిత్యావసరాల ధరలకు అనుగుణంగా రేషన్ డీలర్ల కమీషన్‌ను పెంచాలన్నారు. దిగుమతి హామాలీని ప్రభుత్వమే భరించాలని కోరారు. ప్రతి రేషన్ షాప్‌నకు ఖచ్చితమైన తూకం వేసి పంపాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Godavari Pushkaralu | పుష్కరాల పనులు వేగవంతంగా చేపట్టాలి..