అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Rahul Gandhi Remarks | లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఎంత చేసినా లాభం లేదన్నారు. రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టినా లేస్తలేడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ భవన్‌లో అంబర్‌పేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ విఫలం కావడంతోనే, యువత సీజేపీ పేరుతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులను బీజేపీ బెదిరించగలదు కానీ, యువతరాన్ని కాదన్నారు. ప్రస్తుతం బీజేపీ బలహీనంగా మారిందని ఆయన అన్నారు.
KTR Rahul Gandhi Remarks | మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు
కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మరో ఏడాది రేవంత్ రెడ్డి హడావుడి ఉంటుందని, ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
KTR Rahul Gandhi Remarks | రైతుల అవస్థలు
రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు గోస పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. ఎల్‌నినోపై ముందు నుంచే శాస్త్రవేత్తలు హెచ్చరించినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీచ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కి లేదన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధన బలాన్ని మాత్రమే నమ్ముకుందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Policing Reforms | పోలీసింగ్ విధానాలు మారాలి : సీఎం రేవంత్‌రెడ్డి