అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Update | రాష్ట్రంలో రానున్న 24 గంటలు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం వాతావారణం మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయి.
Weather Update | విస్తారంగా..
తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు లేవు. అక్కడక్కడ చిరు జల్లులు మినహా భారీ వానలు పడలేదు. ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. అయితే నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, నిజామాబాద్ (Nizamabad) జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇతర జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయి. హైదరాబాద్ నగరంలో చెదురుమదురు వానలు పడుతాయి.
దీనిని కూడా చదవండి : Influencer Murder | ఇన్ఫ్లుయెన్సర్ను చెట్టుకు కట్టేసి.. నిప్పంటించి దారుణ హత్య