అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mirza Rahmat Baig | ఎంఐఎం (MIM) బహిష్కృత నేత, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, పదవికి రాజీనామా చేయనని తెలిపారు.
మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కొంతమంది యువకులు ఆయనను పట్టుకొని కొట్టినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో పార్టీ అధినేత ఎమ్మెల్సీపై చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పదవికి సైతం రాజీనామా చేయాలని ఆదేశించారు.
Mirza Rahmat Baig | ఏ తప్పు చేయలేదు
సస్పెన్షన్‌పై ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేయనని పేర్కొన్నారు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టి పారేశారు. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా..డీప్‌ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని ఆయన చెప్పారు. కుటుంబంతో కలిసి ఉమ్రయాత్రలో ఉన్నట్లు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Weather Update | రాష్ట్రానికి మోస్తరు వర్ష సూచన