అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Ponguleti | మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం, పైసల కోసం హరీశ్ రావు ఎంత నీచానికైనా దిగజారుతారనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టె లేదంటూ యువకులను రెచ్చగొట్టి హరీశ్‌రావు శవ రాజకీయాలు చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అనైతికంగా ఆసుపత్రులతో పాల వ్యాపారం చేశారన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పార్టీని కబ్జా చేసేందుకు మరింత దిగజారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండకూడదని క్షుద్రపూజలు చేయించారని కవిత చెప్పారన్నారు. హరీష్ రావు వ్యక్తిత్వం ఎంత నీచమైనదో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టే ఆయనను ఎవరు నమ్మడం లేదన్నారు.
Minister Ponguleti | దోపిడీని బయటకు తీస్తాం
ఎన్ని కుట్రలు చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా… ధరణి పేరుతో దొరలు చేసిన దోపిడీని బయటికి తీస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) నిర్మించి, పేదల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు గుడిసెలు లేని తెలంగాణను నిర్మిస్తామన్నారు. హరీశ్ రావు కుట్రలు, ప్రజలకు మంచి చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోలేవన్నారు.
దీనిని కూడా చదవండి : KNRUHS Fee Hike | మెడికల్ విద్యార్థులకు షాక్.. యూనివర్సిటీ ఫీజులు భారీగా పెంపు