New Pension Sanction | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాల అమలు..

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: New Pension Sanction | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal), చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బోయినపల్లి మండలం కొత్తపేటలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 567 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛను మంజూరు పత్రాలను వారు అందజేశారు.

New Pension Sanction | క్షేత్రస్థాయి విచారణ అనంతరం..

​ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి విచారణ అనంతరం జిల్లాలో 8,209 మందిని, బోయినపల్లి మండలంలో 567 మందిని కొత్తగా పింఛన్లకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుందని వెల్లడించారు. ఇంకా అర్హులుంటే ఎంపీడీఓ, పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బోయినపల్లి మండలం జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉందని అభినందించారు. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు పత్రాలు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులందరూ ఆధార్, ఫోన్ నంబర్ వివరాలతో గ్రామాలు, వార్డుల్లో నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

New Pension Sanction | ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల సాయం,

త్వరలో ఇందిరా మహిళా శక్తి చీరలను సైతం పంపిణీ చేస్తామన్నారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల చేయూత పింఛన్లను సీఎం మంజూరు చేశారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ అమలు చేశామని వివరించారు. మండలంలో రూ.12 కోట్లతో స్టేడియం నిర్మించనున్నామని, చొప్పదండిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.​కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శరత్‌బాబు, తహసీల్దార్ షరీఫోద్దీన్, ఇన్‌ఛార్జి ఎంపీడీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana folk song | యూట్యూబ్‌లో తెలంగాణ ఫోక్ సెన్సేషన్ : అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ రికార్డును బద్దలు కొట్టిన ‘రాను బొంబాయికి రాను’!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *