Pension Criticism | పింఛన్ల పేరుతో కాంగ్రెస్​ ప్రభుత్వం దగా చేస్తోంది: మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి

పింఛన్ల పేరుతో కాంగ్రెస్​ ప్రభుత్వం దగా చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Pension Criticism | పింఛన్ల పేరుతో కాంగ్రెస్​ ప్రభుత్వం దగా చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అన్నారు. నగరంలో(Nizamabad) మీడియాతో ఆయన మాట్లాడారు.

Pension Criticism | సీతక్క, పీసీసీ చీఫ్​కు సవాల్​..

జిల్లాలో కేసీఆర్​ హయాంలో ఇచ్చిన సుమారు 17వేల పింఛన్లను తొలగించి.. కొత్తగా 20వేల పింఛన్లు ఇచ్చారని ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో అలా చేయలేదని నిరూపించాలని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమర్​ గౌడ్​కు తాను సవాల్​ విసురుతున్నాన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో కేవలం 3వేల పింఛన్లు మాత్రమే కొత్తగా ఇస్తున్నారన్నారు. దీనికి పింఛన్ల పండగ పేరుతో ప్రజలను దగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పింఛన్ల పంపిణీపై చర్చకు తాను సిద్ధమని.. తనది తప్పయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

Pension Criticism | ఇచ్చిన హామీలు ఏళ్లుగా పెండింగ్​..

ఇచ్చిన హామీలను ఏళ్లుగా పెండింగ్​ పెట్టిన కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని ప్రశాంత్​రెడ్డి అన్నారు. బీడీ కార్మికులు, వృద్ధులు, మహిళలు మొత్తంగా 3 లక్షల మంది పింఛన్ల కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో అబద్ధపు ప్రమాణాలతో గద్దెనెక్కారని.. రూ.4 వేల పింఛన్​ ఇస్తామని చెప్పిమాట తప్పారన్నారు. మహిళలకు బాకీపడ్డ పింఛన్లు ఇవ్వకుంటే వారే ఎక్కడికక్కడ నిలదీస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బురద నీళ్లూ తోడేందుకు.. ఏపీ కుట్ర 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *