అక్షరటుడే, భీమ్‌గల్: State Level Softball Competitions | మండలంలోని ముచ్కూర్ (Muchkur village) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మాద సుమనశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు పాఠశాల హెచ్ఎం ఆరె రమేశ్ వివరాలు వెల్లడించారు.
State Level Softball Competitions | ప్రతిభ చూపి..
పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుమనశ్రీ ఇటీవల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో పాల్గొంది. ఈనెల 14 నుంచి 18 వరకు నిర్వహించిన శిక్షణ క్యాంపులో ప్రతిభ కనబరిచి నిజామాబాద్ జిల్లా జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈనెల 19 నుంచి 21 వరకు కమ్మర్పల్లిలో జరగనున్న ’11వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్’లో జిల్లా జట్టు తరపున ఆమె ప్రాతినిథ్యం వహించనుంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సుమనశ్రీని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆరే రమేష్, వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాత, గ్రామస్తులు అభినందించారు.
ఇది కూడా చదవండి..: State Level Yoga Competitions | రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని ప్రతిభ