అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగరంలోని (Nizamabad) ధర్నా చౌక్‌లో వెయ్యిరోజుల్లో కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
Bigala Ganesh Gupta | ఏం ఉద్దరించారని సంబరాలు
వెయ్యి రోజుల పాలన పూర్తయిందని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని.. వారు ఏం ఉద్దరించారో స్పష్టం చేయాలని బిగాల పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న పథకాలకు మంగళం పాడిందని ఆయన ఆరోపించారు. 420హామీలు ఇచ్చి వాటిలో ఏమీ అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. తమ బతుకులు మారుతాయని కాంగ్రెస్‌కు ఓటేస్తే వారి నోట్లో మట్టి పోస్తున్నారని దుయ్యబట్టారు.
Bigala Ganesh Gupta | 420 ఫీట్ల భారీ ఫ్లెక్సీ..
రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు విఫలమైనందున ఆ హామీలతో కూడిన 420 ఫీట్ల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నామని బిగాల పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్ఎస్ సిటీ అధ్యక్షుడు సిర్పరాజు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు సత్యప్రకాశ్, సుజిత్ సింగ్ ఠాకూర్, ఢిల్లోడ్ ఆకాశ్, మంజుల యాదవ్, జమాల్పూర్ రమేశ్, నీలగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వెండితెరపై ‘పవర్ స్టార్’.. రాజకీయాల్లో ‘జనసేనాని’..