అక్షరటుడే వెబ్‌డెస్క్: Pawan Kalyan Birthday | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన యువజన విభాగానికి అధికారికంగా ‘జై కొట్టు’ అనే నామకరణం చేసి, దాని లోగోను ఆవిష్కరించారు. కాకినాడ ( Kakinada )జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోతో పాటు అధికారిక గీతాన్ని విడుదల చేశారు. ఈ యువజన విభాగం నేపథ్య గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Pawan Kalyan Birthday | యువతకు పెద్దపీట..
ఈ ప్రత్యేక సందర్భంగా పవన్ కల్యాణ్ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. యువతను పార్టీ కార్యకలాపాల్లో మరింత క్రియాశీలకంగా భాగస్వామ్యం చేయడం, వారికి భవిష్యత్‌లో కీలక బాధ్యతలు, నాయకత్వ అవకాశాలు కల్పించడమే ఈ కొత్త విభాగం ప్రధాన లక్ష్యమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ పుట్టినరోజు వేళ ఈ విభాగాన్ని ప్రారంభించడం అభిమానుల్లో జోష్ నింపింది. పిఠాపురంలో జరిగిన ఈ వేడుకకు జనసేన శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Pawan Kalyan Birthday | ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత రెండు, మూడు నెలలుగా పవన్ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోయారని తెలిపారు. అయినప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నా నిత్యం ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తారని, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కూటమితో కలిసి జనసేన శ్రేణులు చేసిన పోరాటాన్ని, సాధించిన విజయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Nepal Floods | నేపాల్‌లో మళ్లీ ముంచుకొస్తున్న వరద ముప్పు.. డేంజర్ మార్క్ దాటిన నదులు