State Level Yoga Competitions | రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్​ విద్యార్థిని ప్రతిభ

కరీంనగర్​లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్​ విద్యార్థిని ప్రతిభ చూపిందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రామోజీ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: State Level Yoga Competitions | కరీంనగర్ (Karimnagar)​లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్​ విద్యార్థిని ప్రతిభ చూపిందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రామోజీ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

State Level Yoga Competitions | 13వ రాష్ట్రస్థాయి యోగా పోటీలు..

కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు జరిగాయని.. ఈ క్రీడల్లో తమ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ సుభాష్ నగర్ బ్రాంచ్​లో పదో తరగతి చదువుతున్న స్మైత్రిక చారి ప్రతిభ చూపి బంగారు పతకం సాధించారన్నారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని దాదాపు 22 జిల్లాల నుండి వెయ్యి మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. గెలుపొందిన విద్యార్థులు అక్టోబర్ 3 నుండి 7 వరకు జైపూర్​లోని రాజస్థాన్​లో జరుగనున్న 51 జాతీయస్థాయి యోగాసన పోటీలలో పాల్గొంటారన్నారు. తమ విద్యాసంస్థల నుండి స్మైత్రిక చారి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థినికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉప ప్రధానోపాధ్యాయురాలు భావన ఠాకూర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, యోగా కోచ్ గంగాధర్ అభినందనలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి..: Gandhari Ganja Cultivation Bust | అధిక లాభాల ఆశతో గంజాయి సాగు..భగ్నం చేసిన గాంధారి పోలీసులు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *