అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం, రాత్రిపూట వాన పడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రం (Telangana)లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో వాన దంచికొట్టింది. నేడు రంగారెడ్డి, నల్గొండ, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, భువనగిరి, జనగామ, మహబూబాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సైతం అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Danam Nagender Disqualification | ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందంటూ స్పీకర్‌కు ఆర్డర్ కాపీ పంపిన హైకోర్టు!