Electoral Awareness | విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ: Electoral Awareness | ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. కలెక్టరేట్లో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ కాంపిటీషన్స్–2026లో భాగంగా జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు.

Electoral Awareness | జిల్లాస్థాయికి ఎంపికైన విద్యార్థులకు..

అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 120 మంది విద్యార్థినీవిద్యార్థులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థ, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించడంతో పాటు బాధ్యతాయుతమైన ఓటర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Urban Development | రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *