Congress Booth Training | 10న కాంగ్రెస్​ బూత్​లెవల్​ ఏజెంట్లకు శిక్షణ

కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10న బూత్​ లెవెల్​ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Congress Booth Training | కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10న బూత్​ లెవెల్​ ఏజెంట్లకు (Booth level agents) శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ(DCC Nizamabad) కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Congress Booth Training | ఎస్​ఐఆర్​ కోసం..

బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి బూత్​ పరిధిలో ఎస్​ఐఆర్​ నిర్వహిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని(Election Commission) తమ ఆధీనంలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమకు అనుకూలమైన ఓటర్లు పోకుండా చూసుకోవడానికి పార్టీ తరపున ప్రతి బూత్​కు ఏజెంట్లను నియమించామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడానికి శిక్షకులను నియమించినట్లు తెలిపారు.

Congress Booth Training | అర్బన్​ నియోజకవర్గానికి కొనగల మహేష్​..

నిజామాబాద్ అర్బన్ (Nizamabad Urban) నియోజకవర్గానికి కొనగల మహేష్​ను నియమించామన్నారు. ఈనెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు అమ్మ వెంచర్​లోని ఎస్​ఆర్​కే ఫంక్షన్ హాల్​లో నిజామాబాద్ అర్బన్ బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాలని ఆయన సూచించారు. సర్వే పేరుతో ఓటర్లను తొలగిస్తే అది రాబోయే ఎన్నికల్లో మనకి నష్టం జరుగుతుందని కాబట్టి ప్రతిఒక్కరూ శిక్షణ శిబిరానికి హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు అంతా రెడ్డి విజయ పాల్ రెడ్డి, సయ్యద్ సలీం, కోశాధికారి సకినాల శివప్రసాద్, అధికార ప్రతినిధి మహమ్మద్ జియా, కో–ఆప్షన్ మెంబర్ నరేంద్ర సింగ్, డీసీసీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శులు జిల్లెల రమేష్, బాత్నతే శంకర్, అవిన్ ధర్మారం, అర్షద్ పాషా, కార్యదర్శులు రాజు, స్వప్న, మీనా శర్మ సంతోష్, బీఎల్​ రాజు, ప్రవీణ్, సంతోష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు సన్నీ గౌడ్, బసవ సాయి, రాజ్ గగన్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy BJP Criticism | మోరీలు తీయడానికి మోదీ వస్తారా.. సీఎం సంచలన వ్యాఖ్యలు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *