అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Meru Caste Sewing Machines | మేరు కులస్తులకు కుట్టుమిషన్ల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ అన్నారు. ఈ మేరకు నగరం (Nizamabad)లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Meru Caste Sewing Machines | నియోజకవర్గానికి వెయ్యి మిషన్లు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు బీసీ మహిళలకు పంపిణీ చేయనుందని దేవేందర్ పేర్కొన్నారు. అందులో సింహభాగం మేరు కులస్థులకు ఇవ్వాలని జిల్లా మేరు సంఘం ప్రతినిధులు అనేక పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను కలిశామన్నారు. అయితే జీవో జారీ పూర్తయిందని పేర్కొన్నారన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం మేరుకులస్తులకు కుట్టుమిషన్ల పంపిణీలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారని.. దీనికి మేరు కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు జిల్లా మేరు సంఘం ఉపాధ్యక్షులు కొట్టుర్ చంద్రకాంత్ పేర్కొన్నారు. మేరు కులస్తులు సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం కాపీలను బీసీ వెల్ఫేర్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘ నాయకులు మంతెన దశరథ్, ఎన్ను పండరి, విప్లవ కుమారి, అరుణ్ చంద్, దీకొండ లక్ష్మణ్, మాకుల్లా శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Tiranga Rally | తిరంగా ర్యాలీతో గుండె నిండా దేశభక్తి ఉప్పొంగింది