అక్షరటుడే, గాంధారి: Gandhari temple theft | గాంధారి (Gandhari) మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు.
Gandhari temple theft | పెద్ద పోతంగల్ జీపీ పరిధిలోని..
పెద్ద పోతంగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గగండి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు రెండు హుండీలను ధ్వంసం చేశారు. అందులో నుంచి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఎన్నోఏళ్ల చరిత్ర కలిగి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో లింగంతో కొలువైన ఈ ఆలయానికి విశిష్ట ప్రత్యేకత ఉంది. అయితే పాతగుడి కొత్తగుడి రెండింట్లోనూ హుండీలు ఏర్పాటు చేశారు. ప్రతిఏటా శ్రావణమాసం చివరి సోమవారం ఈ హుండీల్లో డబ్బులు లెక్కించి తిరిగి హుండీల్లోనే ఉంచారు. అయితే దాదాపు రూ.50వేలకు పైగా డబ్బు ఉంటుందని గ్రామస్తులు వెల్లడించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఫోక్ బీట్‌కు అనిరుధ్ మాస్ టచ్.. నాని–కీర్తి సురేష్ స్టెప్పులతో ‘యేష నాగుల’ వచ్చేసింది..!