అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KPSC Exam Irregularities | కర్ణాటక (Karnataka) పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన వెటర్నరీ ఆఫీసర్ల పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్‌ను అరెస్ట్ చేశారు.
2016 బ్యాచ్‌కు చెందిన గంగ్వార్‌ను రెండు రోజుల పాటు విచారించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో సహకరించకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు శుక్రవారం సీఐడీ (CID) బృందం ఆయనను దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించింది.
KPSC Exam Irregularities | పరీక్షల నియంత్రణాధికారిగా…
ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖలో ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గంగ్వార్, ఆ అక్రమాలు జరిగిన సమయంలో KPSCలో పరీక్షల నియంత్రణాధికారిగా (Controller of Examinations) కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో ఆయన స్థానంలో మరొకరిని నియమించారు. KPSC నిర్వహించిన పరీక్షలో జరిగిన అక్రమాలకు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆగస్టు 23న ఈడీ అధికారులు బెంగళూరు, బరేలీలోని ఆయన నివాసాలపై దాడులు నిర్వహించారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అధికారుల నియామక ప్రక్రియలో KPSC అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
దీనిని కూడా చదవండి : Minister Ponguleti | బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసేందుకు హరీశ్‌రావు యత్నం : మంత్రి పొంగులేటి