Karnataka CM Resignation | ముఖ్యమంత్రి Siddaramaiah రాజీనామా ఆమోదం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka CM Resignation | Karnataka రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి Siddaramaiah సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ నుంచి (29 మే 2026 తేదీతో) ఉత్తర్వులు వెలువడ్డాయి.

siddiramaih 1

Karnataka CM Resignation | మంత్రివర్గం రద్దు..

నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం గవర్నర్‌కు కల్పించిన అధికారాలను వినియోగించి, సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటించారు. ఆయన నేతృత్వంలోని మంత్రివర్గాన్ని కూడా తక్షణ ప్రభావంతో రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

అయితే, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు సిద్ధరామయ్య తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారని గవర్నర్ ఉత్తర్వుల్లో వివరించారు.

siddiramaih.2

సిద్ధరామయ్య 28 మే 2026న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక, కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

DK Shivakumar Biography | ట్రబుల్​ షూటర్​.. కాంగ్రెస్​ పార్టీకి తిరుగులేని…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *