అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan Ship Collision | అంతర్జాతీయ జలాల్లో ఒక పాకిస్తానీ నౌక, ఇండియన్ నేవీకి చెందిన షిప్ను ఢీకొంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉత్తర అరేబియా సముద్రంలో సెప్టెంబర్ 15న సాయంత్రం సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకకు ఒక పాకిస్తానీ నౌక (Pakistani Ship) సమీపంగా రావడంతో ఈ ఘటన జరిగింది. దీంతో ఎలాంటి పెద్ద నష్టం జరగలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తానీ నౌక అధిక వేగంతో, వృత్తివిరుద్ధంగా, అసురక్షిత పద్ధతిలో విన్యాసాలు చేస్తూ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.
Pakistan Ship Collision | నిబంధనలకు విరుద్ధంగా..
సైనిక విన్యాసాలు, కసరత్తులు, దళాల కదలికల గురించి ముందుగా తెలియజేయడానికి భారత్-పాకిస్తాన్ మధ్య 1991లో ఒప్పందం కుదిరింది. ఒప్పందంలోని ఆర్టికల్ 10ను పాకిస్తానీ నౌక నేరుగా ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. ఈ మేరకు పాక్ హైకమిషన్ర్ పిలిపించి నిరసన తెలిపింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Telangana AICC In Charge | కాంగ్రెస్ నయా వ్యూహం..తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జి మార్పునకు ముమ్మర కసరత్తు