అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government junior colleges | ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రస్తుత సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Government junior colleges | ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో పరిధిలో కామారెడ్డి(Kamareddy) 19, నిజామాబాద్‌లో (Nizamabad) 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, నాలుగు కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ రూముల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఆర్మూర్, డిచ్పల్లి, కామారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి.
Government junior colleges | బడ్జెట్ఒక్కో కాలేజీకి రూ.25లక్షలు..
కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక్కో కాలేజీకి రూ.25లక్షల చొప్పున కేటాయించారు. ఆర్నెళ్ల కాలంలో పనులు పూర్తిచేసి ప్రిన్సిపాల్‌కు అప్పగించాలని ఉన్నతాధికారులు సూచించారు. కంప్యూటర్లు, అవసరమైన సాంకేతిక పరికరాలు, ఫర్నిచర్, విద్యుత్ సదుపాయం, ఇంటర్నెట్ తదితర పనులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్న కళాశాలల్లో అవసరమైన పరికరాలను సమకూర్చడంతో పాటు ల్యాబ్‌లు లేని కళాశాలల్లో కొత్తగా సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న విద్య, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షల్లో కంప్యూటర్ పరిజ్ఞానం కీలకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు కూడా ఆధునిక సాంకేతిక విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.
Government junior colleges | గ్రామీణ విద్యార్థులకు..
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఈ ల్యాబ్‌లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. కంప్యూటర్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తే విద్యార్థులు పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. కంప్యూటర్ ఆపరేషన్, ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ టెక్నాలజీతో పాటు వివిధ సాఫ్ట్వేర్లపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలు పెరగడంతో పాటు భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో పోటీ పడేందుకు అవసరమైన సామర్థ్యం పెరుగుతుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
సాంకేతిక విద్యతో లాభం
– సలాం, డీఐఈవో కామారెడ్డి
కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సాంకేతిక విద్యకు మరింత ప్రాధాన్యం లభించనుంది. ఈ ల్యాబ్‌లతో గ్రామీణ విద్యార్థులకు కంప్యూటర్‌పై పరిజ్ఞానం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: కర్మభూమికి విశ్వాసపాత్రంగా ఉండాలి – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్