Youth Congress Role | దేశాభివృద్ధిలో యూత్​కాంగ్రెస్​ పాత్ర కీలకం

దేశాభివృద్ధిలో యూత్​కాంగ్రెస్​ పాత్ర కీలకమని ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Youth Congress Role | దేశాభివృద్ధిలో యూత్​కాంగ్రెస్​ పాత్ర కీలకమని ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్ (Taher Bin Hamdan)​ పేర్కొన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం(Quit India Day), యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నగరంలోని (Nizamabad) కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Youth Congress Role | పార్టీ జెండా ఆవిష్కరణ

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి అధ్యక్షుడు కౌడప్ శరత్ కుమార్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా పార్టీ జెండాను కౌడప్ శరత్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువజన కాంగ్రెస్ పాత్ర చాలా కీలకమన్నారు. ఆరోజు స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారన్నారు. ఈరోజు దేశంలో బీజేపీ వ్యవహారిస్తున్న తీరును యూత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఎండగట్టాలని సూచించారు. నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతు బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు గాంధీజీ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజారెడ్డి, విపుల్ గౌడ్, యాదగిరి, ప్రవీణ్ గౌడ్, రాజేంద్ర ప్రసాద్, సుధాకర్, ఖుద్ధుస్, వాహీద్, ప్రమోద్, మోయిన్ యూనస్, సంతోష్, బలరాం, పోల ఉష, రవి, గంగారెడ్డి, రఘువీర్, అనుపాల్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: A little more of Rudhra’s world… #Varanasi
తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *