Mla KVR | టీ పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేవీఆర్​

కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన త్రినేత్ర టీ పాయింట్​ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రారంభించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Mla KVR | పట్టణంలోని జీఆర్ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన త్రినేత్ర టీ పాయింట్​ను కామారెడ్డి (Kamareddy) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (KVR MLA) ప్రారంభించారు. ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పీఏ మామిండ్ల రాజు ఈ టీ పాయింట్​ను ఏర్పాటు చేశారు.

Mla KVR | ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..

గురువారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. తన టీ పాయింట్లో పాల ప్యాకెట్లతో కాకుండా న్యాచురల్ పాలతో టీ తయారు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు రుచికరమైన నాణ్యమైన టీ అందిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాల ప్యాకెట్ల ద్వారా టీ తయారీకి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

taa11

ఇది కూడా చదవండి: ‘2036లో భారతదేశం ఒలంపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *