Modi Melbourne | సహాయం చేసేటప్పుడు పాస్‌పోర్ట్ రంగు చూడము.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

విదేశాలకు సాయం అందించే విషయంలో భారత్ ఎప్పుడూ కులమతాలు, ప్రాంతాలు, లేదా పాస్‌పోర్ట్ రంగులను చూడదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Melbourne | విదేశాలకు సాయం అందించే విషయంలో భారత్ ఎప్పుడూ కులమతాలు, ప్రాంతాలు, లేదా పాస్‌పోర్ట్ రంగులను చూడదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని ( Australia ) మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ కార్యక్రమంలో వేలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత్ ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తుండటమే మనపై నమ్మకం పెరగడానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

Modi Melbourne | ప్రసంగంలోని అంశాలు..

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని మోదీ గుర్తు చేశారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిజిటల్ విప్లవంలో భాగంగా భారత్ రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా ఎదిగిందని, ఇప్పుడు మేడిన్ ఇండియాలో భాగంగా 6జీ సాంకేతికత దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లోనూ భారత్ అద్భుతాలు చేస్తోందని, సొంత స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకునే స్థాయికి ఎదిగిందని చెప్పారు.

Modi Melbourne

Modi Melbourne | ఆస్ట్రేలియా – భారత్ సంబంధాలు..

ఆస్ట్రేలియాలో తనకు లభించిన ఆతిథ్యం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. “ఆస్ట్రేలియా పాలు ఉండవచ్చు, కానీ చాయ్‌లో మాత్రం భారతీయత ఉంటుంది. కూరగాయలు ఇక్కడివి అయినా, మసాలాలు మాత్రం మనవే” అంటూ ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని ఆయన సరదాగా వివరించారు. ఒక లక్ష్యం పూర్తయితే మరో సంకల్పంతో ముందుకెళ్లడమే మన నైజం” అని చెబుతూ, ‘గ్రోమోర్-అచీవ్ మోర్’ అనే నినాదంతో ముందుకు సాగాలని ప్రవాసులకు పిలుపునిచ్చారు.

Modi Melbourne | హోరెత్తిన మెల్‌బోర్న్..

మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ భారీ సభకు దాదాపు 30 వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది. ఆస్ట్రేలియాలో మినీ ఇండియాను తలపించేలా సాగిన ఈ కార్యక్రమం, ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Telangana Sports Policy | క్రీడల్ని ప్రోత్సహించేందుకు పాలసీ : సీఎం రేవంత్​రెడ్డి

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *