Tota Sai Prasad | ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్

భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ఉత్కృష్ట సేవా పతకానిని తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ తోట.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Tota Sai Prasad | భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ఉత్కృష్ట సేవా పతకానిని తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ తోట. సాయి ప్రసాద్ ఎంపికయ్యారు.2000 బ్యాచ్​కు చెందిన తోట సాయి ప్రసాద్ 25ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు.

Tota Sai Prasad | అంకితభావం.. అత్యుత్తమ సేవలకు గాను..

పోలీసు శాఖలో ఆయన చూపిన అంకితభావం, అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవ పతకాన్ని ప్రకటించింది. కామారెడ్డి జిల్లా (Kamareddy District) ఎల్లారెడ్డికి చెందిన దివంగత తోట పోచయ్య (ఆర్టీసీ కండక్టర్) తోట సావిత్రి దంపతులకు ముగ్గురు సంతానం కాగా కూతురు భాగ్యలక్ష్మి ప్రైవేట్ టీచర్, రెండో సంతానం తోట సాయిప్రసాద్ ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్, మూడవ కుమారుడు ఏసీబీ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ తోట లింగమూర్తి. తోట సాయిప్రసాద్ 2000లో పోలీసు శాఖకు ఎంపికయ్యారు.

Tota Sai Prasad | ఆయన విధి నిర్వహణ ప్రస్థానమిది..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో పోలీసు శిక్షణ పొందిన తోట సాయిప్రసాద్ పోలీసు సేవా యాత్ర ఇలా కొనసాగింది. తన మొదటి సర్వీసును నిజామాబాద్ జిల్లాలోని డిచ్​పల్లి పోలీస్ స్టేషన్​లో ప్రారంభించారు. అనంతరం రెండో పోస్టింగ్ కార్ఖానా, పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్​లో, మూడో పోస్టింగ్ గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్​లో, నాల్గో పోస్టింగ్ ట్రాన్స్​కో విజిలెల్స్​లో పనిచేశారు. ప్రస్తుతం ఐదో పోస్టింగ్​లో భాగంగా ఇంటెలిజెన్స్ విభాగంలో సేవలందిస్తున్నారు. ఆయన సతీమణి తోట రేణుక ప్రసాద్ ఆర్​అండ్​బీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్​గా మెదక్​లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్​కు అవార్డు రావడంపై ఆయన కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది, 2000 బ్యాచ్ మిత్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Police Sports | క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *