TGSRTC Model Bus Stands | టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టాండ్లు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: TGSRTC Model Bus Stands | తెలంగాణ ( Telangana ) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రోజువారీగా 5 వేలకు పైగా ప్రయాణికుల రద్దీ నమోదవుతున్న 86 బస్ స్టాండ్లను ‘మోడల్ బస్ స్టాండ్లు’గా ఆధునీకరించేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్టేషన్లలో అత్యాధునిక మౌలిక వసతులు , భద్రతా ప్రమాణాలను పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

TGSRTC Model Bus Stands | సరికొత్త టైమ్ టేబుల్స్..

మోడల్ బస్ స్టాండ్లుగా మారనున్న ఈ కేంద్రాల్లో ప్రయాణికుల కోసం పలు కీలక మార్పులు చేపట్టనున్నారు. ఏ బస్సు ఏ సమయానికి వస్తుంది, ఏ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకుంటుందనే పూర్తి సమాచారంతో కొత్త టైమ్ టేబుల్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. మొదటి , చివరి బస్సుల వేళలతో పాటు ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా బస్ స్టాండ్ కార్యకలాపాలు, బస్సుల వేళలను పర్యవేక్షించేందుకు ప్రతి స్టేషన్‌కు ప్రత్యేకంగా ఒక్కో కంట్రోలర్‌ను నియమిస్తున్నారు.

TGSRTC Model Bus Stands |సీసీ కెమెరాల అనుసంధానం..

ప్రయాణికుల భద్రత , రద్దీ నిర్వహణే ధ్యేయంగా ఈ బస్ స్టేషన్లలో విస్తృతంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలను నేరుగా ఆయా ప్రాంతీయ కార్యాలయాలతో పాటు టీజీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి (Head Office) అనుసంధానిస్తారు. దీనివల్ల అధికారులు బస్ స్టాండ్లలో రద్దీ పరిస్థితులను, కార్యకలాపాలను కేంద్ర కార్యాలయం నుంచే నేరుగా పర్యవేక్షించవచ్చు. కాగా, నూతన భవనాల నిర్మాణం, ఏసీ వెయిటింగ్ హాళ్లు, ప్లాట్‌ఫారమ్‌ల ఆధునీకరణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

ఇది కూడా చదవండి: Induru Stadium | ఇందూరులో స్టేడియం నిర్మాణమే నా లక్ష్యం : ఎమ్మెల్యే ధన్​పాల్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *