Anti Paper Leak Bill | పార్లమెంట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

విద్యార్థులు , యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ‘యాంటీ-పేపర్‌ లీక్‌ నిరోధక సవరణ బిల్లు’ నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Anti Paper Leak Bill | విద్యార్థులు , యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ‘యాంటీ-పేపర్‌ లీక్‌ నిరోధక సవరణ బిల్లు’ నిదర్శనమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చను ప్రారంభించిన ఆయన, కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం భారత పార్లమెంటరీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

Anti Paper Leak Bill | పలు రాష్ట్రాల్లో లీకేజీలు..

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ ఇటువంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయని మంత్రి గుర్తుచేశారు. 2009, 2011 సంవత్సరాల్లో ఎన్నో పరీక్షల పేపర్లు లీకయ్యాయని, 2012లో ఎయిమ్స్‌ ప్రవేశ పరీక్ష పేపర్‌ కూడా లీకైందని తెలిపారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో నియామక పరీక్షల లీకేజీలు జరిగాయని చెప్పారు. వీటిని అరికట్టేందుకు గతంలో 1992, 2010 సంవత్సరాలలోనూ ప్రయత్నాలు జరిగాయని, అయితే అవి ఎందుకు పూర్తి కాలేదో నాటి పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్రమంగా ఈ అక్రమాలు వ్యవస్థాగత నేరాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Anti Paper Leak Bill | ప్రధాన నిబంధనలు..

ఇటీవల నీట్‌ (NEET) పేపర్‌ లీక్‌ విషయం వెలుగులోకి రాగానే ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై చర్యలు ప్రారంభించిందని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇటువంటి నేరాలను సమూలంగా అరికట్టేందుకు ప్రస్తుతం తీసుకొచ్చిన బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బిల్లు ప్రకారం దోషులకు విధించే జైలు శిక్షను పదేళ్లకు పెంచడంతో పాటు, పేపర్ లీకేజీ గ్యాంగ్‌లకు విధించే జరిమానాను రూ.1 కోటి నుండి రూ.10 కోట్లకు భారీగా పెంచారు. అలాగే, ఈ కేసుల విచారణను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Bodhan Municipality | బోధన్ మున్సిపాలిటీలో ఆర్‌డీ విచారణ.. నిధుల గోల్​మాల్​పై సర్వత్రా చర్చ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *