Induru Stadium | ఇందూరులో స్టేడియం నిర్మాణమే నా లక్ష్యం : ఎమ్మెల్యే ధన్​పాల్​

ఇందూరులో స్టేడియం నిర్మాణమే తమ లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Induru Stadium | ఇందూరులో స్టేడియం నిర్మాణమే తమ లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (Mla Dhanpal) తెలిపారు. ఖైసర్ అథ్లెటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో నగరంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు.

Induru Stadium | హామీ నిలబెట్టుకోవాలి

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేడియం కోసం ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు గుర్తుచేశారు. ఇందూరులో స్టేడియం నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని చెప్పారు. గత 10 ఏళ్లుగా నిర్విరామంగా అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కేవలం క్రీడా పోటీలనే కాకుండా పోలీసు, ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణను కూడా ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు.

Induru Stadium | ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో..

ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో తర్ఫీదు తీసుకోవాలన్నారు. ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం పుష్కలంగా లభిస్తుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే నగరానికి చెందిన హాకీ క్రీడాకారిణి ఎండల సౌందర్య, బాక్సర్లు నికత్ జరీన్, హుస్సముద్దీన్, పర్వతారోహకురాలు పూర్ణా మలావత్ కు క్రీడా కోట కింద ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో కైసర్ అకాడమీ ఫౌండర్ ఖైసర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, కరాటే రమేష్, కార్పొరేటర్లు ఎండి అన్వర్ అమర్ సింగ్, మఠం పవన్, కో ఆప్షన్ మెంబర్ సురేందర్, ఎంపీజే అబ్దుల్ అజీజ్, అడ్వకేట్ జునేద్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *