అక్షరటుడే వెబ్‌డెస్క్: EPFO Minimum Pension | కోట్లాది మంది ఉద్యోగులు, పింఛనుదారుల చూపు ఇప్పుడు ఈపీఎఫ్ఓ (EPFO) నిర్వహించబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంపైనే నిలిచింది. ఈ నెల నవంబర్ 19, 2026న ఢిల్లీలోని ( Delhi )ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలో 240వ సీబీటీ భేటీ జరగనుంది. తొలుత ఈ సమావేశాన్ని గుజరాత్‌లోని గిర్‌లో నిర్వహించాలని భావించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల వేదికను ఢిల్లీకి మార్చారు. ఈ మేరకు రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సుబ్రతా భౌమిక్ నవంబర్ 4న సీబీటీ సభ్యులకు సమాచారం అందించారు.
EPFO Minimum Pension | రూ.3వేలకు పెంపు?
ఈ సమావేశంలో ఉద్యోగుల పింఛను పథకం (EPS-95) కింద ప్రస్తుతం అందిస్తున్న కనీస నెలవారీ పింఛనును రూ.1,000 నుండి రూ.3,000కు పెంచే ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. కార్మిక , ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ పెంపుపై ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
EPFO Minimum Pension | సుదీర్ఘ పోరాటం..
సెప్టెంబర్ 2014 నుంచి కనీస నెలవారీ పింఛను రూ.1,000 వద్దే నిలిచిపోయింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ కొద్ది మొత్తం ఏమాత్రం సరిపోదని, కనీస పింఛనును రూ.7,500కి పెంచాలని వివిధ ఉద్యోగ, పింఛనుదారుల సంఘాలు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఆర్గనైజ్డ్ రంగంలోని ఉద్యోగుల కోసం ఉద్దేశించిన ఈపీఎస్ స్కీమ్‌లో యజమాని చెల్లించే పీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం వెళ్తుంది. నవంబర్ 19న జరిగే సమావేశం తర్వాతే కేంద్ర నిర్ణయంపై పూర్తి స్పష్టత రానుంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi Telangana Visit | రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన ఖరారు..